వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ పోటీల్లో లాంగ్‌ జంప్‌ విజేతగా మురళీ శ్రీశంకర్

Telugu Lo Computer
0


పోర్చుగల్ వేదికగా వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ పోటీల్లో భారత లాంగ్‌ జంప్‌ అథ్లెట్ మురళీ శ్రీశంకర్ విజేతగా నిలిచాడు. శ్రీశంకర్‌ తొలి రౌండ్‌లో 7.63 మీటర్లు జంప్ చేశాడు. ఇక రెండో రౌండ్‌లో 7.75 మీటర్లు దూకి టాపర్‌గా నిలిచాడు. ఆ తర్వాత 7.69 మీటర్లు జంప్‌ చేసిన అతడు నాలుగో రౌండ్‌లో ఫౌల్‌ అయ్యాడు. ఐదో రౌండ్‌లో 6.12 మీటర్లు, ఆరో రౌండ్‌లో 7.58 మీటర్లు జంప్‌ చేశాడు. దీంతో 7.75 మీటర్ల అత్యుత్తమ ప్రదర్శన చేసిన శ్రీశంకర్ విజేతగా నిలిచాడు. పోలాండ్‌ అథ్లెట్ పియోటర్ టార్కోవ్స్కి, ఆస్ట్రేలియాకు చెందిన క్రిస్ మిట్రెవ్స్కీ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)