ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా కుప్పంలో మహిళను కరెంట్ స్థంభానికి కట్టేసిన వీడియోపై ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. ఆ మధ్యే.. ఓ మహిళను చెట్టుకు కట్టేసిన ఘటన సంచలనం సృష్టించడం, దానిపై తీవ్ర రాజకీయ దుమారం రేగడం, ఆ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పందించి బాధిత మహిళకు అండగా నిలిచారు. ఇప్పుడు, శాంతిపురం మండలం, తమ్మిగానిపల్లిలో ఓ మహిళను కరెంట్ పోల్‌కు కట్టేసిన వీడియో వైరల్ అయ్యింది. దీనిపై స్పందించిన పోలీసులు క్లారిటీ ఇచ్చారు. శాంతిపురం మండలం, తమ్మిగానిపల్లిలో సొంత కొడుకే తల్లిని కరెంట్ స్థంభానికి కట్టి డ్రామా ఆడినట్లు పోలీసులు నిర్ధారించారు. బంధువులతో ఉన్న ఆస్థి తగాదాల విషయంలో తప్పుడు ప్రచారం కోసం తల్లిని డ్రిప్ పైపులతో కరెంట్ పోల్‌కు కట్టేశాడు. ఇక, తమ బంధువులు తన తల్లిని స్థంభానికి కట్టేశారని ఫేస్ బుక్‌లో ఓ వీడియో పెట్టాడు కుమారుడు. ఇప్పటికే ఓ ఘటన జరడగం, అది కాస్త వివాదం కావడం కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ ఘటన కూడా వెలుగు చూడడంతో ఆ వీడియోను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టారు. చివరకు, సానుభూతి కోసం కొడుకు సురేష్ డ్రామా ఆడాడని తేల్చారు. సురేష్ పై కేసు నమోదు చేసి డ్రామా సృష్టించిన సురేష్ ను అరెస్ట్ చేశారు..
సానుభూతి కోసం తల్లిని కరెంటు స్తంభానికి కట్టేసి డ్రామా ఆడిన కొడుకు !
July 14, 2025
0
Tags