భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో హైదరాబాద్ మల్లాపూర్‌లోని ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన సదస్సులో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు వల్ల కలిగే నష్టంపై ప్రజంటేషన్ ఇచ్చారు. ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలు, భవిష్యత్ కార్యాచరణపై బీఆర్‌ఎస్వీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి ఏనాడూ జై తెలంగాణ అనలేదు. ఉద్యమ గుర్తులు, చరిత్ర చెరిపేసే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి పాలనలో నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి వెళ్తున్నాయి. కాంగ్రెస్, భాజపా, చంద్రబాబు కలిసి రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, కృష్ణా, గోదావరి జలాల్లో వాటాను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. గురు శిష్యులు కలిసి తెలంగాణకు చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు. గోదావరి జలాలను ఏపీకి తరలించే కుట్ర చేస్తున్నారని, రేవంత్‌రెడ్డి నిలదీసే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ నేతృత్వంలో మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని, అసవరమైతే భారత రాష్ట్రసమితి తరఫున సుప్రీంకోర్టుకు వెళ్తామని హరీశ్‌రావు తెలిపారు.
రేవంత్‌రెడ్డి పాలనలో నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి వెళ్తున్నాయి !
July 26, 2025
0
Tags