మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ శనివారం ఉదయం పుణె సమీపంలోని పింప్రీ చించ్వాడ్‌లోని పలు ప్రాంతాలను పరిశీలించారు. స్థానికంగా జరుగుతోన్న పనులను గమనించారు. అక్రమ నిర్మాణాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలో అజిత్‌తో స్థానిక సర్పంచి గణేశ్ జంబూల్కర్ మాట్లాడారు. ప్రజా సమస్యలపై మీడియా ఎదుటే ప్రశ్నించడంతో డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. ''మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. హింజెవాడి నుంచి ఐటీ పార్క్ మహారాష్ట్ర నుంచి బెంగళూరు, హైదరాబాద్ తరలిపోతోంది. కానీ మీకు ఏ పట్టింపు లేదు. ఇంత ఉదయం నేను ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది ? ఇక నాకు ప్రత్యామ్నాయం ఏమీ లేదు. కఠిన చర్యలు తీసుకోవడం ఒక్కటే మిగిలిఉంది'' అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. కెమెరాలను ఆపండి అంటూ మరోవైపు మీడియా వాళ్లకు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంలో భాగమైన ఆయన ఐటీ పార్క్ వెళ్లిపోతోందని వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్ర లోని హింజెవాడిలో 2,800 ఎకరాల్లో రాజీవ్‌గాంధీ ఐటీ పార్క్ ఉంది. అందులో 800 కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
మహారాష్ట్ర నుంచి ఐటీ పార్క్ బెంగళూరు, హైదరాబాద్ తరలిపోతోంది !
July 26, 2025
0
Tags