తృణమూల్‌ నేత, బీజేపీ నాయకురాలు కలిసి కారులో మద్యం తాగిన వీడియో వైరల్‌

Telugu Lo Computer
0


శ్చిమ బెంగాల్‌లోని జలపాయ్‌గురి జిల్లాలో ప్రత్యర్థులైన తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) నేత, బీజేపీ నాయకురాలు కలిసి కారులో మద్యం సేవించారు. అపల్‌చంద్ అటవీ ప్రాంతం సమీపంలో చాలాసేపు రెండు కార్లు ఆగి ఉండటాన్ని స్థానికులు గమనించి వాటి వద్దకు వెళ్లి పరిశీలించగా ఇది బయటపడింది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. టీఎంసీ పంచాయతీ సమితి అధ్యక్షుడు, జిల్లా స్థాయి నాయకుడు పంచనన్ రాయ్ కారులో అతడి డ్రైవర్‌తోపాటు బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు దీపా బానిక్ అధికారి ఉన్నారు. వారంతా కలిసి అందులో మద్యం సేవిస్తున్నారు. కారులో ఉన్న బీజేపీ నాయకురాలు జనాన్ని చూసి మద్యం గ్లాస్‌ను ముందు సీటులో ఉంచింది. ఆ తర్వాత కారు నుంచి కిందకు దిగి, తన కారులోకి ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయింది. మరోవైపు టీఎంసీ నేత రాయ్‌, అతడి డ్రైవర్‌ను స్థానికులు నిలువరించారు. కొంతసేపటి తర్వాత డ్రైవర్‌తో కలిసి కారులో అక్కడి నుంచి ఆయన కూడా వెళ్లిపోయాడు. అయితే ప్రత్యర్థి పార్టీలకు చెందిన టీఎంసీ నేత, బీజేపీ నాయకురాలు కలిసి కారులో మద్యం సేవించడం స్థానికంగా కలకలం రేపింది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)