ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో శుక్రవారం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు. అబుజ్మడ్ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారంతో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు పోలీస్ అధికారులు చెప్పారు. ఈ ఘటన తర్వాత, ఆ ప్రాంతంలో విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలు, ఏకే-47/ఎస్ఎల్ఆర్ రైఫిల్స్, ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలను , నిత్యావసర వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆపరేషన్ కొనసాగుతున్నట్లు చెప్పారు.
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ : ఆరుగురు మావోయిస్టులు మృతి
July 18, 2025
0
Tags