పిల్లలు సోషల్‌ మీడియాలో గడిపే సమయాన్ని నియంత్రించాలి : ఎలాన్‌ మస్క్‌

Telugu Lo Computer
0


వివా టెక్నాలజీస్‌ నిర్వహించిన కార్యాక్రమంలో ఎలాన్‌ మస్క్‌ మాట్లాడుతూ పిల్లలు సోషల్‌ మీడియాలో గడిపే సమయాన్ని నియంత్రించాలని సూచించారు. సంతోషాన్ని పెంచే డొపమైన్‌ అనే హార్మోన్‌ అత్యధికంగా ఉత్పత్తి అయ్యేలా ఏఐ సహకారంతో ప్రోగ్రామ్‌ చేస్తూ చిన్నారులు అత్యధిక సమయం గడిపేలా సోషల్‌ మీడియాలు చేస్తున్నాయని తెలిపారు. చిన్నారులు సామాజిక మాధ్యమాల్లో ఉండే సమయాన్ని తల్లిదండ్రులు నియంత్రించాలని కోరారు. మరో సోషల్‌ మీడియా పోస్టులో ఆయన స్పందిస్తూ ''ప్రస్తుత సోషల్‌ మీడియా పిల్లలను బానిసలుగా మార్చుకొనేలా డొపమైన్‌ ఉత్పత్తిని పెంచేట్లు రూపొందించారు. ఇవి చిన్నారులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి'' అని వ్యాఖ్యానించారు. ఆయన వివా టెక్నాలజీస్‌లో మాట్లాడిన దానిని రీపోస్టు చేశారు. మస్క్‌ స్వయంగా సామాజిక మాధ్యమం ఎక్స్‌కు యజమాని కావడం గమనార్హం. పిల్లల కోసం ఏఐ యాప్‌ను లాంచ్‌ చేయనున్నట్లు టెక్‌ దిగ్గజం ఎలాన్‌ మస్క్‌ వెల్లడించారు. దానిని ఆయన బేబీ గ్రోక్‌గా అభివర్ణించారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)