మెటల్‌ ఛైన్‌ ధరించి ఎంఆర్ఐ రూమ్‌లోకి వెళ్లిన వ్యక్తి దుర్మరణం

Telugu Lo Computer
0


మెరికాలోని న్యూయార్‌లో తన భార్య ఎంఆర్ఐ స్కాన్‌ చేయించుకునే క్రమంలో స్కానింగ్‌రూమ్‌లోకి వచ్చిన వ్యక్తి మెషిన్‌లోకి లాగబడి మరణించారు. ఘటనపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లాంగ్ ఐలాండ్‌కు చెందిన 61 ఏళ్ల కెయిత్ మెక్‌అలిస్టర్ అనే వ్యక్తి తన భార్య అడ్రియన్ జోన్స్‌తో పాటు ఒక హాస్పిటల్‌కు వెళ్లారు. అక్కడ తన భార్య మొకాలుకు స్కాన్‌ చేయాలని వైద్యులను కోరారు. దీంతో వాళ్లు ఎంఆర్ఐ చేయాలని సూచించారు. దీంతో వైద్యులు ఆమెకు ఎంఆర్ఐ స్కాన్ తీసేందుకు సిద్ధమై ఆమెను రూమ్‌లోకి తీసుకెళ్లారు. స్కాన్ జరుగుతున్నప్పుడు ఆమె భర్త మెక్అలిస్టర్ సడెన్‌గా ఎంఆర్ఐ గదిలోకి వెల్లాడు. అయితే అతని మెడలో బరువైన ఒక మెటల్‌ ఛైన్‌ ఉడడంతో అంత్యంత మాగ్నెటిక్‌ పవర్‌ కలిసిన ఆ ఎంఆర్ఐ మిషన్‌లోకి అతను లాగబడ్డాడు. అది గమనించిన ఎంఆర్ఐ టెక్నీషియన్, అతని భార్య మెక్‌అలిస్టర్‌ను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించినా ఎలాంటి ఫలితం లేకపోయింది. మిషన్‌ ఆఫ్‌ చేసిన తర్వాత అతన్ని దానిలోంచి బటయకు తీసి హాస్పిటల్‌కు తరలించారు. కాగా తీవ్రగాయాలైన 61 ఏళ్ల మెక్అలిస్టర్ గురువారం హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించారు. ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాపును ప్రారంభించారు. ఎంఆర్ఐ స్కాన్ జరుగుతుండగా ఆ వ్యక్తి గదిలోకి ఎందుకు ప్రవేశించాడో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)