''మాపై వచ్చే సిల్లీ న్యూస్‌ చూసినప్పుడు మా రియాక్షన్‌ ఇదే'' అంటూ ఫొటోను షేర్ చేసిన నయనతార

Telugu Lo Computer
0

కోలీవుడ్‌లో నయనతార, విఘ్నేశ్‌ దంపతులు విడిపోనున్నారంటూ ఇటీవల ప్రచారం జరిగింది. విడాకులు తీసుకోబోతున్నారన్న కోణంలో పలు వెబ్‌సైట్లు కథనాలు ప్రచురించాయి. వాటిపై నయనతార తాజాగా స్పందించారు. తన భర్త విఘ్నేశ్‌ శివన్‌తో కలిసి దిగిన ఫొటో షేర్‌ చేస్తూ ''మాపై వచ్చే సిల్లీ న్యూస్‌ చూసినప్పుడు మా రియాక్షన్‌ ఇదే'' అంటూ ఆ అసత్య ప్రచారాన్ని ఖండించారు. వైవాహిక బంధం గురించి నయనతార కొన్ని రోజుల క్రితం సోషల్‌ మీడియాలో పెట్టిన ఓ పోస్టు వదంతులకు దారితీసింది. 'తెలివి తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం పొరపాటు. నీ భర్త తప్పులకు నువ్వు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు' అంటూ పోస్టు పెట్టిన ఆమె కొన్ని గంటల వ్యవధిలోనే దాన్ని డిలీట్‌ చేశారు. ఆ లోగా స్క్రీన్‌షాట్స్‌ వైరల్ కావడం గమనార్హం. దీంతో, నయనతార- విఘ్నేశ్‌ విడాకుల రూమర్స్‌ వచ్చాయి. సినిమాల విషయానికొస్తే.. చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న 'మెగా 157' (వర్కింగ్‌ టైటిల్‌), యశ్‌ 'టాక్సిక్‌' తదితర చిత్రాల్లో నటిస్తున్నారు నయనతార. ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా విఘ్నేశ్‌ 'లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ' తెరకెక్కిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)