రియల్టీ, ఫార్మా అండతో నష్టాలకు బ్రేక్

Telugu Lo Computer
0


దేశీయ మార్కెట్లు మంగళవారాన్ని లాభాలతో ముగించాయి. వరుసగా మూడు రోజులుగా కొనసాగుతోన్న నష్టాలకు నేడు బ్రేక్ పడింది. ఈ ఉదయం 80,973.25 వద్ద సెన్సెక్స్ ప్రారంభమైంది. ఇంట్రాడేలో 80,665కు తగ్గి.. చివరకు 446 పాయింట్లు పుంజుకొని 81,328 వద్ద ముగిసింది. నిప్టీ 140 పాయింట్ల లాభంతో 24,821 వద్ద స్థిరపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 15 పైసలు తగ్గి 86.82 గా ముగిసింది. నిఫ్టీ సూచీలో జియో ఫైనాన్షియల్, లార్సెన్, రిలయన్స్‌, ఆసియన్ పెయింట్స్‌, ఐషర్ మోటార్స్‌ రాణించగా.. ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌, యాక్సిస్ బ్యాంక్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, టైటాన్‌ కంపెనీ షేర్లు కుదేలయ్యాయి. ఐటీ, లోహ, రియల్టీ రంగాల్లో కొనుగోళ్లకు మదుపర్లు ఆసక్తి కనబర్చడం ఈ లాభాలకు కారణమైంది. మార్కెట్‌ అస్థిరతను అంచనా వేసే వీఐఎక్స్‌ సూచీ 2.9 శాతం క్షీణించింది. యూఎస్‌ మార్కెట్లు లాభాల్లో ప్రారంభం అవుతాయనే సంకేతాలు మన మార్కెట్లపై ప్రభావం చూపించాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)