జూలై 3న అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం జరుపుతారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని తొలగించడానికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను ఉపయోగించకుండా ప్రజలను ప్రోత్సహించడానికి ఈ దినోత్సవాన్ని జరుపుతారు. ప్లాస్టిక్ బ్యాగ్‌ల వాడకాన్ని తగ్గించటం, పర్యావరణాన్ని కాపాడటం, మంచి పర్యావరణ ప్రత్యామ్నాయాలపై అవగాహన పెంచడం ఈ దినోత్సవ ఉద్దేశ్యం. ప్లాస్టిక్ కాలుష్యం మన ఆరోగ్యానికి, వన్యప్రాణులకు హాని చేస్తుంది.ప్రపంచవ్యాప్తంగా పోగవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల్లో అయిదో వంతు భారత్ నుంచే ఉన్నాయి. ఒక్కో భారతీయుడు సగటున సంవత్సరానికి 11 కిలోల ప్లాస్టిక్‌ను వినియోగిస్తున్నట్లు అంచనా. ఏటా మన దేశంలో 93 లక్షల టన్నుల వ్యర్థాలు వస్తుండగా, అందులో 35 లక్షల టన్నులు పర్యావరణంలోకి చేరుతున్నాయి.
అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం
July 03, 2025
0
Tags