లారీని ఢీకొన్న కారు : ఫిల్మ్ నగర్ ఎస్సై రాజేశ్వర్ గౌడ్ మృతి

Telugu Lo Computer
0


తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా చేర్యాల గేటు వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఫిల్మ్ నగర్ ఎస్సై రాజేశ్వర్ గౌడ్ మృతి చెందారు. బల్కంపేటలో బందోబస్తుకు వచ్చిన రాజేష్ గౌడ్ బందోబస్తు ముగించుకొని కారులో తిరిగి ఇంటికి వెళుతున్న క్రమంలో లారీని వెనుక నుంచి కారు డీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఎస్సై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఎస్సై రాజేశ్వర్ స్వస్థలం సంగారెడ్డిలోని చాణక్యపురి కాలని. రోడ్డు ప్రమాదంలో ఎస్సై రాజేశ్వర్ గౌడ్ మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)