తెలంగాణ పరిపాలన కుంటుపడిందని, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి నేత హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలు వచ్చాయని అందుకనే రైతుబంధు వేస్తున్నారని చెప్పారు. రైతుబంధును నాట్లు, నాట్లకు మధ్య కేసీఆర్ ఇస్తే రేవంత్‌రెడ్డి ఓట్లు ఓట్లకు మధ్య ఇస్తున్నారని మండిపడ్డారు. గ్రామాల్లో ఎరువులు, యూరియా లభించట్లేదన్నారు. ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చి అమలు చేయట్లేదని విమర్శలు గుప్పించారు.
తెలంగాణ పరిపాలన కుంటుపడింది !
July 07, 2025
0
Tags