తమిళనాడు సీఎం స్టాలిన్‌కు స్వల్ప అస్వస్థత

Telugu Lo Computer
0


మిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ ఉదయం ఆయన సాధారణంగా మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో ఆకస్మికంగా ఆయనకు తల తిరిగినట్టు అనిపించడంతో వెంటనే అప్రమత్తమైన సహాయకులు, కుటుంబ సభ్యులు ఆయన్ను చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అసుపత్రికి చేరే సమయంలో స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కూడా ఆయనతో పాటు ఉన్నారు. ఈ నేపథ్యంలో అపోలో మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ మీడియాతో మాట్లాడుతూ.."స్టాలిన్ గారి ఆరోగ్యం నిలకడగా ఉంది. ఎలాంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేవు. అవసరమైన అన్ని వైద్య పరీక్షలు చేశాం. ఆయన పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉన్నారు" అని తెలిపారు. ప్రస్తుతం సీఎం స్టాలిన్ విశ్రాంతి తీసుకుంటుండగా, వైద్యులు పర్యవేక్షణలో ఉన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)