విపక్షాల నిరసనలతో అట్టుడికిన లోక్‌సభ

Telugu Lo Computer
0


పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు తొలి రోజే వాడీవేడిగా జరిగాయి. ఇటు అధికార పక్షం, అటు విపక్షాలు ప్రతినిధులు పరస్పరం నినాదానాలతో హెరెత్తించారు. 'ఆపరేషన్ సిందూర్', ఎయిరిండియా విమాన ప్రమాదంపై విపక్ష ఎంపీలు ప్రధాని నరేంద్ర మోడీ స్పందించాలని పట్టుబట్టారు. స్పీకర్ ఓం బిర్లా ఎంత వారించినా నిరసనకు దిగడంతో లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. సభ మొదలైన కాసేపటికే స్పీకర్ బిర్లా మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా వేశారు. అయితే.. ఆ తర్వాత కూడా విపక్షాలు పట్టువీడకపోవడంతో చివరకు రేపటికి సభను వాయిదా వేయాల్సి వచ్చింది. సభ మొదలైన కాసేపటికే ఆపరేషన్ సిందూర్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. భారత్, పాక్‌ల మధ్య యుద్ధాన్ని నేను ఆపాను అంటూ ట్రంప్ ప్రగల్భాలు పలకడంపై మోడీ సభా వేదికగా వివరించాలని పట్టుబట్టారు కాంగ్రెస్ ఎంపీలు. అయితే.. స్పీకర్ ఓం బిర్లా తర్వాతి చర్చల్లో అందుకు అనుమతిస్తానంటూ చెప్పారు. అయినా సరే కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ ఎంపీలు ప్రధాని మాట్లాడాల్సిందేనని పట్టుబట్టారు. దాంతో, సెషన్ ఆరంభమైన 20 నిమిషాలకే స్పీకర్ వాయిదా వేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)