ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా భీమిలి మండలంలోని నేరెళ్లవలసలో కుటుంబ కలహాల నేపథ్యంలో అర్ధరాత్రి నిద్రిస్తున్న భర్తపై భార్య సలసల కాగే నీళ్లు పోసింది. ఈ ఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడి ముఖం, ఛాతి భాగం కాలిపోయింది. స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై అందరూ షాక్‌కు గురవుతున్నారు. నందిక కృష్ణ, గౌతమిలు ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుని నేరెళ్లవలసలో నివాసం ఉంటున్నారు. పెళ్లయిన కొన్నాళ్లకు భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. కృష్ణ వేధింపులు భరించలేని గౌతమి బుధవారం రాత్రి 2 గంటల సమయంలో భర్త కృష్ణపై వేడి నీళ్లు పోసింది. వేంటనే అతడు కేకలు వేశాడు. చుట్టుపక్కల వారు వచ్చి చూడగా కృష్ణ మొహం మొత్తం కాలిపోయింది. వెంటనే విశాఖ కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భర్తపై సలసల కాగే నీళ్లు పోసిన భార్య !
July 31, 2025
0
Tags