పాకిస్తాన్ లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.ఇప్పటికే పెరిగిన వస్తువుల ధరలు, నిరుద్యోగం, దినసరి ఖర్చుల భారం వంటి వాటితో సతమతమవుతున్న ప్రజలు తాజా ప్రభుత్వ నిర్ణయంతో ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నారు. రెండు వారాల కాలానికి ఇంధన ధరలను పెంచుతున్నట్లుగా పాకిస్తాన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అయితే పదిహేను రోజుల వ్యవధిలో ఇంధన ధరలను రెండు సార్లు పెంచింది పాకిస్తాన్ ప్రభుత్వం. జూన్ 16 2025న పాక్ ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.4.80, డీజిల్‌పై రూ.7.95 పెంచి ప్రజలకు షాకిచ్చింది.. తాజాగా నేడు జూలై 1న మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపు అమల్లోకి వచ్చింది. తాజా పెంపుతో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.8.36 పెరిగింది. దీంతో దాయాది దేశంలో .258.43 ఉన్న పెట్రోల్ ధర తాజా పెంపుతో రూ.266.79కి చేరుకుంది. ఇక డీజిల్ ధర లీటర్‌కు రూ. 10.39 పెరగడంతో అది కాస్తా రూ.262.59 నుంచి రూ.272.98కి చేరుకుంది. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల మార్పులే ఈ పెరుగుదలకు కారణంగా ప్రభుత్వం పేర్కొంది. అయితే విచిత్రం ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి.
పాకిస్తాన్ లో లీటర్ పెట్రోల్ రూ. 272
July 01, 2025
0
Tags