తెలంగాణలో జూలై 14న కొత్త రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం తెలిపారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను ప్రారంభిస్తారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పలువురు లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు అందజేస్తారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.4 లక్షల రేషన్ కార్డులు జారీ చేయబడతాయని, తద్వారా 11.3 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం తెలిపింది. కొత్తగా జారీచేయనున్న రేషన్ కార్డులతో కలిపి రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 94 లక్షలకు పెరుగుతుందని, తద్వారా లబ్దిదారుల సంఖ్య 3.14 కోట్లకు చేరుతుందని పేర్కొంది.
జూలై 14న కొత్త రేషన్ కార్డుల పంపిణీ
July 12, 2025
0
Tags