అమెరికన్‌ చిన్నారులకు ట్రంప్‌ ఖాతాలు !

Telugu Lo Computer
0


2025-29 మధ్య అమెరికా పౌరులకు జన్మించే ప్రతి చిన్నారి పేరిట 1,000 డాలర్ల సొమ్ముతో ఓ ఇన్వెస్ట్‌మెంట్‌ ఖాతాను ప్రభుత్వం ఉచితంగా తెరుస్తుంది. వీటిని 'ట్రంప్‌ ఖాతా'లుగా పిలవనున్నారు. ఈ విషయం సోమవారం శ్వేతసౌధంలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో చర్చకు వచ్చింది. దీనిలో ఉబర్‌, గోల్డ్‌మన్స్‌ సాక్స్‌, డెల్‌ టెక్నాలజీస్‌ వంటి సంస్థల సీఈవోలు పాల్గొన్నారు. ''2024 జనవరి 31 తర్వాత నుంచి 2029 డిసెంబర్‌ 31 మధ్య జన్మించే అమెరికన్‌ పౌరులకు ఫెడరల్‌ ప్రభుత్వం ఏక మొత్తంగా 1,000 డాలర్లను ట్యాక్స్‌ డెఫర్డ్‌ ఖతాలో జమచేస్తారు'' అని ట్రంప్‌ పేర్కొన్నారు. ఈ ఖాతాలను పిల్లల సంరక్షకులు నియంత్రిస్తారు. వారు ఈ ఖాతాలో ప్రైవేటు కాంట్రిబ్యూషన్‌ కింద ఏటా 5,000 డాలర్ల వరకు జమచేసే అవకాశం ఉంది. ఇది భావితరాల దీర్ఘకాలిక ఆర్థిక అభివృద్ధిని బలోపేతం చేసేందుకు ఉపయోగపడతాయని ట్రంప్‌ అభిప్రాయపడ్డారు. ఈ ఖాతాలను ప్రైవేటుగా నిర్వహిస్తూ ఆ చిన్నారికి 18 ఏళ్లు నిండే వరకు వడ్డీని అందులో జమ చేస్తారు. ఇది అన్నిరకాల ఆదాయ వర్గాల వారి పిల్లలకు వర్తిస్తుంది. కాకపోతే చిన్నారి తల్లిదండ్రుల్లో కనీసం ఒకరు వర్క్‌ఆథరైజేషన్‌తో పాటు సోషల్‌ సెక్యూరిటీ నెంబర్‌ను సమర్పించాల్సి ఉంది. వెనకబడిన వర్గాలకు లబ్ధి చేకూర్చే పథకాలను నిలిపివేసి ఇటువంటి వాటికి ట్రంప్‌ మద్దతు తెలపడం పలు వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. ''దేశాల ఎదుగుదల, పతనం అనేది సంపదలో వ్యత్యాసాల నుంచి, వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పోయినప్పుడు చోటుచేసుకొంటుంది'' అని సిలికాన్‌ వ్యాలీ ఇన్వెస్టర్‌ గెరెస్టనర్‌ వెల్లడించారు. ఈ బిల్లును ప్రతినిధుల సభలో ఆమోదించారు.   ఇక సెనెట్‌లో పాస్‌ కావాల్సిఉంది. కానీ, అక్కడ కొంత ప్రతిఘటన ఎదురుకావచ్చని భావిస్తున్నారు

Post a Comment

0Comments

Post a Comment (0)