ఢిల్లీలో కరోనాతో బాలిక మృతి

Telugu Lo Computer
0

ఢిల్లీలో 22 సంవత్సరాల బాలిక కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయింది. ఇప్పటికే బాలిక టీబీతో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ ఏడాది కొవిడ్‌ మరణాల సంఖ్య నాలుగుకు చేరింది. జనవరి ఒకటి నుంచి ఢిల్లీలో 436 మందికి కరోనా సోకింది. ఇందులో 357 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. శనివారం 91 మంది కరోనా నుంచి కోలుకొని ఆసుపత్రుల నుంచి ఇండ్లకు వెళ్లిపోయారు. ఆసుపత్రుల్లో కొవిడ్‌ రోగులకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు ఢిల్లీ ఆరోగ్యశాఖ పేర్కొంది. ప్రైవేటు ఆసుపత్రుల సహకారం సైతం తీసుకుంటున్నామని.. ప్రస్తుతం రోగులు భయపడాల్సిన అవసరం లేదని.. ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. రోగులకు పడకలు, మందులు, ఇతర అవసరమైన పరికరాలను అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. ప్రస్తుతానికి కరోనాను తేలికగా తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. లక్షణాలు కనిపిస్తే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిస్తున్నారు. ఇంట్లో వృద్ధులు, తీవ్రమైన రోగులు సురక్షితంగా ఉండాలని.. కరోనా మహమ్మారి తర్వాత చిన్న చిన్న వ్యాధులు చాలాకాలం పాటు కొనసాగుతున్నాయని డాక్టర్ చెబుతున్నారు. దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి తేలికపాటి లక్షణాలు నెలల తరబడి రోగులను ఇబ్బంది పెడుతున్నాయి. ఎవరిలోనైనా కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)