హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిన్న జరిగిన వర్క్ షాపుకు ఎమ్మెల్యే రాజాసింగ్ దూరంగా ఉన్నారు. పలువురు నేతలు ఈ వర్క్ షాపుకు దూరం కాగా, అందులో రాజాసింగ్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజాసింగ్‌కు పార్టీ అధిష్టానం నోటీసులు ఇవ్వబోతుందనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రధానంగా దీనిపై స్పందించిన రాజాసింగ ' మీడియాలో ఒక వార్త నడుస్తుంది, రాజాసింగ్‌కు నోటీస్ ఇవ్వడానికి పార్టీ ప్లాన్ చేస్తోందనే చర్చ తెరపైకి వచ్చింది. ఒకవేళ అదే నిజమైతే నోటీస్ కాదు - ఏకంగా నన్ను సస్పెండ్ చేయండి' అంటూ రాజాసింగ్ సంచలన ప్రకటన చేశారు. అదే సమయంలో కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. ఒకవేళ నన్ను సస్పెండ్ చేస్తే అప్పుడు అందరి జాతకం బయటపెడతా. ఎవరి వల్ల పార్టీకి నష్టం జరిగింది అనే నిజం చెప్పి అందరి జాతకం ప్రజలు ముందు పెడతా' అని రాజాసింగ్ పేర్కొన్నారు.
నన్ను సస్పెండ్ చేస్తే అందరి జాతకం బయటపెడతా : ఎమ్మెల్యే రాజాసింగ్
June 02, 2025
0
Tags