ప్రేమ వ్యవహారంలో తల్లి మందలించడంతో హత్య చేసిన బాలిక

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్ఎల్బీ నగర్ లో సట్ల అంజలి, తన కూతురుతో కలిసి నివాసం ఉంటోంది. బాలిక టెన్త్ క్లాస్ చదువుతోంది. పగిల్ల శివతో బాలికకు పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. తరచుగా అతడితో మాట్లాడుతుండడాన్ని గుర్తించిన తల్లి కూతుర్ని మందలించింది. అతడ్ని కలవొద్దు అని, ప్రేమ వ్యవహారం లాంటి వాటి జోలికి వెళ్లొద్దని బాగా చదువుకోవాలని కుమార్తెకు సూచించింది. దాంతో ఇక ప్రియుడ్ని కలుస్తానో లేదో, అతడు దూరం అవుతాడని భావించి కన్నతల్లి హత్యకు ప్లాన్ చేసింది. ప్రియుడు పగిల్ల శివ, అతడి సోదరుడు పగిల్ల యశ్వంత్ తో కలిసి తల్లిని హత్య చేయాలని నిర్ణయించుకుంది. సోమవారం అర్ధరాత్రి తన ప్రియుడితో కలిసి తల్లి అంజలి గొంతు నులిమి, ఆపై తలపై కొట్టి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. బాలికను జీడిమెట్ల పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ప్రేమ వ్యవహారంలో అడ్డు చెబుతుందన్న కారణంగానే తల్లి హత్యకు ప్లాన్ చేసి చంపేసిందని జీడిమెట్ల పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)