సిగ్నల్‌ కట్‌ చేసి చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి గ్రామం వద్ద అర్ధరాత్రి సమయంలో ముంబై నుంచి చెన్నైకి వెళ్తున్న చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌ రైలులో గుర్తు తెలియని దుండగులు భారీ దోపిడీకి పాల్పడ్డారు. దుండగులు కోమలి సమీపంలో సిగ్నల్‌ కేబుల్‌ కట్‌ చేయడంతో రైలు నిలిచిపోయింది. ఎస్1, ఎస్2 బోగీల్లోకి చొరబడిన దుండగులు.. ప్రయాణికులను బెదిరించి డబ్బులు, బంగారు నగలు దోచుకున్నారు. ప్రయాణికులు గట్టిగా కేకలు వేయడంతో దుండగులు పరారీ అయ్యారు. ఈ ఘటనపై బాధిత ప్రయాణికులు రేణిగుంట రైల్వే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)