పదేళ్ల కేసీఆర్ పాలనలో నీళ్లు, నిధులు, నియామకాలకు పెద్దపీట వేశాం : కేటీఆర్

Telugu Lo Computer
0

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకు హరీశ్ రావు శనివారం ఏర్పాటు చేసిన పవర్ పాయంట్ ప్రజెంటేషన్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరై మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్, బీజేపీలు నాటకాలు ఆడుతున్నాయి. నీటి పారుదల శాఖలో ఏ మంత్రి పనిచేయనంత ఉధృతంగా పదేళ్ల కేసీఆర్ పాలనలో హరీశ్ రావు పని చేశారు. మిషన్ కాకతీయతో పాటు ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసి తెలంగాణలో కోటి ఎకరాల మాగాణిని సృష్టించిన ఘనత వారిద్దరికే దక్కిందని తెలిపారు. నేటి పవర్ పాయింట్ చూస్తుంటే సీడబ్ల్యూసీ మాజీ సభ్యులు ఆర్.విద్యాసాగర్ గుర్తుకొస్తున్నారు అని కేటీఆర్ అన్నారు. తెలంగాణకు సాగు నీటి రంగంలో తెలంగాణకు జరిగిన అన్యాయం ఆనాడు 'నీళ్లు-నిజాలు' అనే పుస్తకం ద్వారా వెలుగులో తీసుకొచ్చారని గుర్తు చేశారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో నీళ్లు, నిధులు, నియామకాలకు పెద్దపీట వేసి వాటిని ఫుల్‌ఫిల్ చేశామని అన్నారు. పాలముూరు-రంగారెడ్డితో పాటు సీతారామ ప్రాజెక్ట్‌లను 90 శాతం పూర్తి చేశామని అన్నారు. నేడు నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్‌లైన్ ఎక్కడో పోయిందని.. ప్రస్తుతం నిందలు, దందాలు, చందాలు రాజ్యం నడుస్తోందని అన్నారు. బీఆర్ఎస్ మీద నిందలు, బిల్డర్లు-కాంట్రాక్టర్లతో దందాలు, రాహుల్ గాంధీకి చందాలు అన్న విధంగా కాంగ్రెస్ పాలన కొనసాగుతోందని సెటైర్లు వేశారు. కాంగ్రెస్, బీజేపీలు కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో నాటకాలు ఆడుతున్నారని, నీళ్ల విషయంలో చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని తెలిపారు. గుజరాత్‌లోని మార్బిలో పెద్ద వంతెనల కూలి 140 మంది చినిపోయినా ఎన్డీఎస్‌ఏ ఎందుకు పోలేదన్నారు. బీహార్‌లో ప్రతి నాలుగు రోజులకు ఒకసారి బ్రిడ్జిలు కూలుతున్నా అడిగే నాథుడే లేడని ఫైర్ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలి రూ.100 కోట్లు నష్టం వాటిల్లినా ఇదే ఎన్డీఎస్ఏ ఎక్కడికి పోయిందని అన్నారు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్లో 8 మంది ప్రాణాలు కోల్పోయినా నేటికి ఆ ప్రాజెక్ట్‌ను పునరుద్ధరిస్తారా అన్న విషయంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్, సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం లేదని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)