అమరావతిలో గూగుల్‌ సంస్థ ఏర్పాటు ?

Telugu Lo Computer
0

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్‌ రానుంది. రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్నతస్థాయిలో గూగుల్‌ ప్రతినిధులు చర్చిస్తున్నారు. అనంతవరం, నెక్కల్లు మధ్య ఈ-8 రోడ్డు పక్కన సర్వేనంబర్లు 10, 12, 13, 15, 16లో సుమారు 143 ఎకరాల భూమి ఉంది. దాన్ని గూగుల్‌కు కేటాయించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. గూగుల్‌ సంస్థ ప్రారంభించబోయే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు అమరావతిలో అంకురార్పణ చేయనున్నట్లు తెలిసింది. ఆ సంస్థ ప్రతినిధులు, సీఆర్డీఏ అధికారులతో కలసి శుక్రవారం నెక్కల్లులో స్థలం పరిశీలించారు. ఇక్కడికి సమీపంలో విమానాశ్రయం, రైల్వేస్టేషన్‌ కూడా రానుండడంతో సంస్థ ప్రతినిధులు ఈ స్థలం వైపే మొగ్గుచూపినట్లు సమాచారం.

Post a Comment

0Comments

Post a Comment (0)