తెలంగాణ మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుపై దాఖలైన ఎన్నికల పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల సమయంలో సరైన వివరాలు వెల్లడించలేదని చక్రధర్ గౌడ్ అనే అభ్యర్థి ఈ పిటిషన్ దాఖలు చేశారు. నాడు ఎన్నికల నామినేషన్ దాఖలు చేసిన హరీష్ రావు తమ ఆస్తులను సరిగా వెల్లడించలేదని, ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు చక్రధర్ గౌడ్ ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని తేల్చిచెప్పింది. ఈ కేసులో హరీష్ రావు తరపున మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రాంచందర్ రావు వాదనలు వినిపించారు.
హరీష్ రావుపై దాఖలైన ఎన్నికల పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు
June 10, 2025
0