రుతుపవనాల ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.రాష్త్రంలో నేడు, రేపు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, గాలి దిశల మార్పు కారణంగా రాష్ట్రంలో వర్షపాతం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. సోమవారం జరిగిన వర్షపాతం గణాంకాలను చూస్తే, కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా 9 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేడు, రేపు భారీ వర్షాలు
June 10, 2025
0
Tags