బెంగళూరులోని కోలార్ జిల్లా సంజప్ప నగర్ ప్రాంతంలో స్కూటీపై ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళను ఇద్దరు హెల్మెట్ ధరించిన వ్యక్తులు వెంటాడి, ఆమెను నేలపైకి లాగి నగలను దోచుకున్న ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సీసీటీవీ ఫుటేజ్ లో లభించిన ప్రాథమిక సమాచారం ప్రకారం, స్కూటీపై వెళ్తున్న మహిళను ఇద్దరు వ్యక్తులు అనుసరించారు. మొదట సహాయం అడిగి ఆమెను ఆపేందుకు యత్నించారు. కానీ ఆమె వారిని పట్టించుకోకుండా తన స్కూటీ వేగంగా నడిపించడానికి ప్రయత్నించారు. అయినా వారు ఆమెను వెంబడించటం కొనసాగించారు. భయంతో ఆమె జనసంచారమున్న ప్రాంతానికి వెళ్లి, తన స్కూటీ ఆపి సహాయం కోసం అరిచింది. ఇదే సమయంలో వారిలో ఒకరు బైక్‌పై నుండి దిగి ఆమె దగ్గరకు చేరడంతో ఆమె స్కూటీ నుంచి దిగి తప్పించుకునేందుకు ప్రయత్నించగా, దుండగుడు ఆమెను నేలపైకి లాగి, ఆమె ఒంటిపైనున్న బంగారు ఆభరణాలను బలవంతంగా లాక్కున్నాడు. ఆమె కేకలు విన్న స్థానికులు అక్కడికి పరుగెత్తుతూ రాగా, దుండగులు బైక్‌పై ఎక్కి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దాడి ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.
పట్టపగలు మహిళ ఒంటిపైనున్న బంగారు ఆభరణాలను దోచుకున్న దుండగులు : సీసీటీవీ ఫుటేజ్ ఇంటర్నెట్‌లో వైరల్
June 29, 2025
0
Tags