దేశీయ మార్కెట్లో వివో ఎక్స్200 ఎఫ్ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ఇటీవలే తైవాన్‌లో విడుదలైంది. ఈ హ్యాండ్‌సెట్ లో 50-మెగాపిక్సెల్ సెన్సార్ తో జైస్-బ్రాండెడ్ ట్రిపుల్ రియర్ కెమెరా వుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్‌సెట్ ఉంటుంది, ఇది IP68+ IP69 రేటింగ్‌లతో వస్తుంది. ఈ ఫోన్ 6500mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6500mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. వివో పరీక్షల ప్రకారం, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 25.44 గంటల యూట్యూబ్ ప్లేబ్యాక్ సమయాన్ని ఇస్తుంది. పూర్తిగా ఛార్జ్ కావడానికి 57 నిమిషాలు మాత్రమే పడుతుంది. తైవాన్‌లో ఈ ఫోన్ ఫ్యాషన్ పింక్, లైట్ హనీ ఎల్లో, మినిమలిస్ట్ బ్లాక్ , మోడరన్ బ్లూ ఫినిషింగ్‌లలో వచ్చింది. ఇందులో 12GB RAM+512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అందించారు.
త్వరలో వివో ఎక్స్200 ఎఫ్ఈ స్మార్ట్‌ఫోన్ విడుదల
June 29, 2025
0
Tags