మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్‌లలోని సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేయాలన్న డిమాండ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించింది. ఓటర్ల గోప్యతా హక్కును పరిగణనలోకి తీసుకోవడంతో పాటు చట్టపరమైన ఆటంకాల కారణంగా వాటిని బహిరంగపర్చలేమని తేల్చి చెప్పింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సీసీ ఫుటేజీలు బహిరంగపర్చాలని ప్రతిపక్షాల డిమాండ్లు చేస్తున్న సంగతి తెలిసిందే. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పదే పదే డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇలా చేయడం ఓటర్ల గోప్యతకు భంగం కలిగించడమే అవుతుందని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. సీసీటీవీ ఫుటేజీ ఫుటేజ్ ద్వారా ఓటు వేసినవారిని, వేయని వారిని గుర్తించవచ్చు. తద్వారా వాళ్లపై వివక్ష లేదంటే బెదిరింపులకు పాల్పవచ్చు. చట్టపరమైన పరిమితులు: ఈ ఫుటేజ్‌ను బయట పెట్టడం ద్వారా.. ప్రజాప్రతినిధుల చట్టం ఉల్లంఘన అవుతుంది. పైగా ఓటు వేయడం.. ఓటు వేయకపోవడం వ్యక్తిగత హక్కు అని సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చింది. ఈ వీడియోలు కేవలం అంతర్గత పర్యవేక్షణ కోసం మాత్రమే. ఒకవేళ కోర్టు ఆదేశిస్తే మాత్రమే వాటిని పంచుతాం. ఎన్నికల ఫలితాలపై 45 రోజుల్లోగా కోర్టులో పిటిషన్ దాఖలు కాకపోతే, ఆ తర్వాత వీడియో ఫుటేజ్‌ను తొలగించడం సాధారణ ప్రక్రియనే అని ఈసీ తెలిపింది
పోలింగ్ బూత్‌లలోని సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేయాలన్న డిమాండ్‌ను తిరస్కరించిన ఈసీ
June 21, 2025
0
Tags