ఆంధ్రప్రదేశ్ లో యువకుడిపై చిరుత దాడి ?

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా కౌతాళం మండలం తిప్పలదొడ్డి గ్రామ ప్రజలు చిరుత సంచారంతో భయాందోళనలో ఉన్నారు. దానిని పట్టుకునేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ క్రమంలో జనసంచారం నుంచి పొలాల్లోకి వెళ్ళే క్రమంలో కోల్‌మాన్‌ పేటకు చెందిన లక్ష్మయ్య అనే యువకుడిపై చిరుత దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో గాయపడిన లక్ష్మయ్యను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. చిరుతను బంధించేందుకు ప్రత్యేక బోనులు ఏర్పాటు చేసినట్లు ఫారెస్టు అధికారులు చెబుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)