హైదరాబాద్ నగరంలోని రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారులు బారులు తీరారు. ఒకేసారి మూడు నెలల కోటా బియ్యం ఇస్తుండటంతో పోటెత్తారు. రద్దీ కారణంగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. సర్వర్ డౌన్ కావడంతో వేలిముద్రల నమోదులో జాప్యంతో పంపిణీ ఆలస్యమవుతోంది. ఉదయం, సాయంత్రం రెండు షిఫ్టుల్లో రేషన్ అందిస్తున్నారు. సర్వర్ డౌన్ వల్ల రేషన్ తీసుకోవడం ఆలస్యమవుతుండటంతో క్యూలైన్లలో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు.
హైదరాబాద్ లో రేషన్ దుకాణాల వద్దకు బారులు తీరిన లబ్ధిదారులు
June 06, 2025
0
Tags