పొదిలిలో మహిళలు, పోలీసులపై దాడి చేసిన వాళ్లపై చర్యలు తీసుకోండి

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని పొదిలిలో మహిళలు, పోలీసులపై దాడి చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని డీజీపీని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రైతుల పేరుతో పర్యటనకు శాంతి భద్రతల సమస్యల సృష్టిస్తారా అంటూ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఆయన ధ్వజమెత్తారు. కాగా మాజీ సీఎం జగన్ పొదిలి పర్యటన నేపథ్యంలో స్థానికంగా ఉద్రిక్తతలు చోటు చేసుకుంది. అమరావతి రైతులు, మహిళలను కిందచపర్చేలా సాక్షి టీవీలో డిబేట్ నిర్వహించిన విషయం తెలిసిందే. దీంతో రైతులు, మహిళలు, రాష్ట్రవాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. సాక్షి చైర్ పర్సన్, జగన్ సతీమణి భారతీరెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పొదిలి జగన్ పర్యటన నేపథ్యంలోనూ నిరసన వ్యక్తం చేశారు. పొదిలి మెయిర్ రోడ్డు సెంటర్‌లో జగన్‌కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు.. రైతులు, మహిళలపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో పలువురు మహిళతో పాటు పోలీసులకు గాయాలయ్యాయి. దీంతో వైసీపీ నాయకులపై వ్యతిరేక వ్యక్తమవుతోంది. మహిళలపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తోంది. దీంతో ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. రైతుల పరామర్శ పేరుతో వెళ్లి ఈ అరాచకాలు ఏంటని ప్రశ్నించారు. రైతుల కోసం వెళ్లి జిల్లా వ్యాప్తంగా జనసమీకరణ ఎందుకు అని నిలదీశారు. ఆంక్షలు లేకుండా అనుమతులు ఇస్తుంటే, దాన్ని అలసత్వంగా భావిస్తున్నారా?, దుర్వినియోగం చేస్తారా? అని మండిపడ్డారు. నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాని ఆదేశించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)