శంషాబాద్‌ సమీపంలో చిత్ర షూటింగ్‌ షూటింగ్‌లో భారీ ప్రమాదం

Telugu Lo Computer
0


రామ్‌ వంశీకృష్ణ దర్శకత్వంలో హీరో నిఖిల్ సిద్ధార్థ్‌ 'ది ఇండియా హౌస్‌' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ది ఇండియన్ హౌస్ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. అందులో భాగంగా హైదరాబాద్‌ శివారు శంషాబాద్‌ సమీపంలో చిత్ర షూటింగ్‌ బుధవారం జరుగుతుండగా ప్రమాదం సంభవించింది. సముద్రపు సన్నివేశాల కోసం ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో షూటింగ్‌ లొకేషన్ మొత్తం వరదతో నిండిపోయింది. ఈ ప్రమాదంలో అసిస్టెంట్ కెమెరామెన్‌కు తీవ్ర గాయాలయ్యాయని, మరి కొంతమందికి గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఒకరి మినహా మిగతా వారి పరిస్థితి నిలకడగా ఉందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రమాదంతో సినిమాకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. వాటర్‌ ట్యాంకర్‌ పేలడంతో నీళ్లన్నీ సెట్‌లోకి వరదలా పోటెత్తాయి. దీని కారణంగా సెట్‌ నాశమైందని సమాచారం. చారిత్రక నేపథ్యంతో ది ఇండియా హౌస్‌ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. వీర్‌ సావర్కర్‌, నాథూరామ్‌ గాడ్సే ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కుతోందని సినీ పరిశ్రమలో చర్చ జరుగుతోంది. ఈ సినిమాను గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, అభిషేక్‌ అగర్వాల్‌తో కలిసి నిర్మిస్తున్నారు. సాయి మజ్రేకర్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా సీనియర్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. రెండేళ్ల కిందట ప్రారంభించిన ఈ సినిమా షూటింగ్‌ నిలకడగా సాగుతోంది. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే సినిమా ఆలస్యం కాగా, తాజాగా జరిగిన ప్రమాదంతో మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)