శాంతియుత అణు కార్యక్రమాన్ని అభివృద్ధి చేసుకునే హక్కు ఇరాన్‌కు ఉంది !

Telugu Lo Computer
0


ణ్వాయుధ తయారీకి ఇరాన్‌ సన్నాహాలు చేస్తోందని చెప్పేందుకు ఎటువంటి ఆధారాలు లేవని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. ఇదే విషయాన్ని ఇప్పటికే ఇజ్రాయెల్‌కు పలుమార్లు స్పష్టం చేశామని పుతిన్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడిస్తున్నాయి. శాంతియుత అణు కార్యక్రమాన్ని అభివృద్ధి చేసుకునే హక్కు ఇరాన్‌కు ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో ఆ దేశానికి మద్దతు ఇవ్వడానికి రష్యా ఎప్పటికీ సిద్ధంగా ఉంటుందని అన్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధాన్ని ఎలా ఆపాలనే విషయంపై తాము ఇరుదేశాల నేతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. కాగా ఇజ్రాయెల్‌ను నాశనం చేస్తామంటూ కొన్ని దశాబ్దాలుగా టెహ్రాన్‌ బహిరంగంగానే సవాల్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకునేందుకు ఆ దేశం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు టెల్‌ అవీవ్‌కు నిఘా వర్గాల సమాచారం అందడంతో వాటిని ధ్వంసం చేయాలనే లక్ష్యంతో నెతన్యాహు ఇరాన్‌పై దాడులకు ఆదేశాలిచ్చారు. ఇటీవలి కాలంలో ఇరాన్‌ అధిక మొత్తంలో యురేనియంను శుద్ధి చేసిందని.. దాంతో తొమ్మిది అణుబాంబులు తయారు చేయొచ్చని ఆయన వెల్లడించారు. ఇప్పుడా దేశాన్ని ఆపకపోతే.. అతి తక్కువ సమయంలోనే అణ్వాయుధాలను తయారు చేస్తోందని.. అది ఇజ్రాయెల్‌కు పెను ప్రమాదంగా పరిణమిస్తుందని తెలిపారు. నాజీల దురాగతాల నుంచి తాము పాఠాలు నేర్చుకున్నాం కాబట్టి.. మరోసారి బాధితులుగా మిగలాలనుకోవట్లేదని అందుకే 'ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌' పేరుతో టెహ్రాన్‌పై దాడులు కొనసాగిస్తున్నామని అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సైతం ఇరాన్‌ అణ్వాయుధాలు తయారు చేస్తోందని ఆరోపించారు. దీనిని నివారించడానికి తమ దేశంతో అణు ఒప్పందం చేసుకోవాలని సూచించారు. అలా కాని పక్షంలో పరిస్థితులు మరింత తీవ్రంగా ఉంటాయని పలుమార్లు ఇరాన్‌ను హెచ్చరించారు. ఈ యుద్ధంలో అమెరికా చేరికపై స్పష్టతనివ్వనప్పటికీ.. టెహ్రాన్‌ ఇప్పటికే హద్దులు దాటిందని, దీనిపై స్పందించడం ఆలస్యమైందన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)