నూడుల్స్ సూప్ లో మొబైల్ ఫోన్ ప్రత్యక్షం !

Telugu Lo Computer
0


స్ట్రేలియాలోని అడిలైడ్‌లో నివసించే ఓ మహిళ గత వారం ఓ హాట్‌పాట్ టేక్‌అవే షాపు నుంచి నూడుల్స్ సూప్ ఆర్డర్ చేశారు. కొంత అక్కడే తిని, మిగిలినది ఇంటికి తీసుకెళ్లారు. ఇంట్లో ఆ హాట్‌పాట్ తింటుండగా, అడుగు భాగాన ఏదో తేడాగా కనిపించింది. ఆమె నూడుల్స్ అడుగున స్పూన్‌తో తీస్తుంటే ఏదో గట్టిగా తగిలిందన్నారు. ఈ క్రమంలో ఇంకాస్త లోతుగా చూడగా, కంటైనర్ అడుగున మొబైల్ కనిపించింది. సూప్ నుంచి ఫోన్‌ను బయటకు తీసినప్పుడు దాని స్క్రీన్‌పై టెంపరేచర్ వార్నింగ్ కనిపించిందని ఆమె చెప్పారు. ఈ క్రమంలో ఆమె వెంటనే రెస్టారెంట్‌కు వెళ్లి నా హాట్‌పాట్‌లో ఓ ఫోన్ దొరికిందని చెప్పారు. దీంతో వాళ్లు స్పందిస్తూ మా చెఫ్స్‌లో ఒకరి ఫోన్ కనపడట్లేదని తెలిపారు. ఆ ఫోన్ వారికి ఇవ్వడంతో వాళ్లు ఆమెకు థాంక్స్ చెప్పారు. ఇదే సమయంలో క్షమాపణలు కూడా చెప్పారు. దానికి ఆమె ఫర్వాలేదని అన్నారు. పొరపాటున చెఫ్ తన ఫోన్‌ను టేక్‌అవే కంటైనర్‌లో పెట్టి ఉంటారని, అది నల్లగా ఉండటం వల్ల ఆహారం ప్యాక్ చేసిన వ్యక్తి దానిని గమనించి ఉండకపోవచ్చని ఆమె వివరించారు. అయితే, ఆమె రెస్టారెంట్ పేరును వెల్లడించలేదు. ఈ మేరకు న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం ఈ ఘటనకు సంబంధించిన విషయాన్ని శ్రద్ధ అనే మహిళ స్వయంగా ఓ టిక్‌టాక్ వీడియోలో పంచుకున్నారు. అది కాస్త వైరల్‌గా మారింది. దీంతో ఆ మహిళ స్పందించిన తీరుపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)