లారీ, ఆటో ఢీకొని ఇద్దరు మృతి

Telugu Lo Computer
0


తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా సదాశివపేట పరిధిలోని కంబాలపల్లి చౌరస్తా లో లారీ, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మామిడిపళ్లను ఆటోలో తీసుకొని ఇద్దరు వ్యక్తులు మార్కెట్ కు వెళుతున్నారు. వారు ప్రయాణిస్తున్న ఆటో కంబాలపల్లి చౌరస్తా వద్దకు రాగానే లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో  సాయికుమార్ (22), అభిషేక్ (13) అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసు కున్న సదాశివపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాల ను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)