భారత్-పాక్ వివాదం కారణంగా అనేక రాష్ట్రాల్లో వినియోగదారులు కొనుగోళ్లను ఆలస్యం చేయడం, ఎంట్రీ-లెవల్ మోడళ్లకు డిమాండ్ మరింత తగ్గడంతో గత మే నెలలో ప్యాసింజర్ వెహికల్ రిటైల్ అమ్మకాలు 3 శాతం తగ్గాయని డీలర్ల సంస్థ FADA ఈ రోజు తెలిపింది. 2024, మేలో 3,11,908 యూనిట్లతో పోలిస్తే గత నెలలో ప్యాసింజర్ వెహికల్ రిజిస్ట్రేషన్లు 3,02,214 యూనిట్లుగా ఉన్నాయి. జమ్మూ & కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌లలో యుద్ధ సంబంధిత ఆందోళనలు, సరిహద్దు ఉద్రిక్తతలు పెరగడం వలన కొనుగోలుదారులు కొనుగోళ్లను ఆలస్యం చేసి ఉండొచ్చని పరిశ్రమ వర్గాల అభిప్రాయం. ద్విచక్ర వాహన రిటైల్ అమ్మకాలు మే నెలలో 7 శాతం పెరిగి 16,52,637 యూనిట్లకు చేరుకున్నాయి. గత సంవత్సరం ఇదే కాలంలో ఈ అమ్మకాలు 15,40,077 యూనిట్లు. వాణిజ్య వాహన రిటైల్ అమ్మకాలు గతేడాది మే నెలతో పోలిస్తే ఈ మే నెలలో 4 శాతం తగ్గి 75,615 యూనిట్లకు చేరుకున్నాయని FADA పేర్కొంది. గత నెలలో త్రీ వీలర్ రిజిస్ట్రేషన్లు..2024 మే నెల అమ్మకాలతో పోలిస్తే 6 శాతం పెరిగి 1,04,448 యూనిట్లకు చేరుకున్నాయి.
మే లో 3% క్షీణించిన ప్యాసింజర్ వెహికల్ రిటైల్ అమ్మకాలు
June 06, 2025
0
Tags