మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ప్రఫుల్ల బిజ్వే కుటుంబం ఇటీవల విహారయాత్ర కోసం హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలికి వెళ్లింది. సోలాంగ్ వ్యాలీలో అతడి పదేళ్ల కుమార్తె త్రిశ జిప్‌లైనింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కేబుల్ తెగిపోయింది. దీంతో ఆమె దాదాపు 30 అడుగుల ఎత్తు నుంచి కింద ఉన్న బండరాళ్లపై పడిపోయింది. బాలిక తీవ్రంగా గాయపడడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. దెబ్బలు బలంగా తగలడంతో ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే తక్షణ సాయం అందించడానికి జిప్‌లైన్ నిర్వాహకులు అక్కడ భద్రతా ఏర్పాట్లేవీ చేయలేదని బాధితులు ఆరోపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పర్యాటక ప్రదేశాల్లో భద్రత పట్ల నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జిప్‌లైన్ ఆపరేటర్లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
బాలిక జిప్‌లైనింగ్ చేస్తుండగా తెగిన కేబుల్ : పరిస్థితి విషమం
June 15, 2025
0
Tags