మహారాష్ట్ర లోని పుణెలో ఇంద్రయాని నదిపై ఉన్న బ్రిడ్జి కుప్పకూలింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో దాదాపు 25 నుంచి 30 మంది టూరిస్టులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. ఇప్పటి వరకు ఆరుగురిని సురక్షితంగా కాపాడినట్లు సమాచారం. మరి కొంతమంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ఇంద్రయాని నదిపై ఉన్న బ్రిడ్జి పురాతనమైనది కావడంతో భారీ వర్షాలకు కుప్పకూలినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారణకు వచ్చారు. నదిలో కొట్టుకుపోయిన టూరిస్టులకోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో నదిని గాలిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఇంద్రయాని నదిపై ఉన్న బ్రిడ్జి కుప్పకూలి 30 మంది టూరిస్టులు గల్లంతు ?
June 15, 2025
0
Tags