భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆర్టీజీఎస్ లో ఇస్రోను భాగస్వామ్యం చేసింది. ఆర్టీజీఎస్ శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ తో అయిదు సంవత్సరాల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో షార్ డైరెక్టర్ రాజరాజన్, ఆర్టీజీఎస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రఖర్ జైన్.. ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్, ప్రజలకు సుపరిపాలనను అందించే దిశగా ఇస్రోను ప్రభుత్వంలో సాంకేతిక భాగస్వామిని చేయడం, ఆ ప్రతిష్ఠాత్మక సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకున్న దక్షిణాదిన మొట్టమొదటి రాష్ట్రం ఏపీనే. ఇప్పటివరకు ఏ రాష్ట్రం కూడా ఇస్రోతో ఈ తరహా ఒప్పందం కుదుర్చుకోలేదు. రియల్ టైమ్ పౌర కేంద్రీకృత పాలన కోసం అంతరిక్ష సాంకేతికతను ఉపయోగించుకోవడంలో ఈ ఒప్పందం ఓ మైలురాయి వంటిదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వ్యవసాయం, వాతావరణం, విపత్తు నిర్వహణ, పట్టణ ప్రణాళిక మొదలైన 42కు పైగా అప్లికేషన్లలో ఉపగ్రహ చిత్రాలు, శాస్త్రీయ ఇన్‌పుట్‌లతో అవేర్ ప్లాట్ ఫామ్ ను మెరుగుపరుస్తుందని అన్నారు. ఈ ప్లాట్ ఫామ్ ద్వారా ఎస్ఎంఎస్, వాట్సప్, మీడియా, సోషల్ మీడియా ద్వారా పౌరులు- ప్రభుత్వానికి రియల్-టైమ్ సలహాలు, సూచనలు అందించగలమని చంద్రబాబు తెలిపారు. ఉపగ్రహాలు, డ్రోన్లు, ఐఓటీ సెన్సార్లు, మొబైల్ ఫీడ్స్, సీసీటీవీల నుండి డేటాను ఏకీకృతం చేయడానికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు
ఆర్టీజీఎస్ లో ఇస్రోను భాగస్వామ్యం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
June 03, 2025
0
Tags