నీట్‌ పీజీ పరీక్ష వాయిదా ?

Telugu Lo Computer
0


జూన్‌ 15న జరగాల్సిన నీట్‌ పీజీ పరీక్ష వాయిదా పడింది. వైద్య విద్యలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ (పీజీ) కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే ఈ జాతీయస్థాయి అర్హత పరీక్షను ఒకే షిఫ్టులో నిర్వహించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తగిన సంఖ్యలో పరీక్షా కేంద్రాలు, మౌలికసదుపాయాల ఏర్పాటు కోసం నీట్‌ పీజీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు నేషనల్‌ బోర్డు ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ పరీక్ష నిర్వహించే కొత్త తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)