ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో విచారణకు హాజరైన మహేశ్‌కుమార్‌ గౌడ్‌

Telugu Lo Computer
0


తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ హాజరయ్యారు. ఈ కేసులో సాక్షిగా ఆయన తన వాంగ్మూలం ఇవ్వనున్నారు. 2023 నవంబరులో శాసనసభ ఎన్నికల సమయంలో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నందున అప్పటి భారాస ప్రభుత్వం తన ఫోన్‌ను ట్యాప్‌ చేసిందని గతంలో మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆరోపించారు. ఈ నేపథ్యంలో పోలీసుల సూచన మేరకు జూబ్లీహిల్స్‌ పీఎస్‌లో విచారణకు ఆయన హాజరయ్యారు.

Post a Comment

0Comments

Post a Comment (0)