ప్రముఖ మలయాళ నటుడు షైన్ టామ్ చాకో ప్రయాణిస్తున్న కారు సేలం-బెంగళూరు జాతీయ రహదారిపై ఇవాళ ఉదయం రోడ్డు ప్రమాదానికి గురై చాకోతో పాటు సోదరుడు, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా, చాకో తండ్రి దుర్మరణం పాలైయ్యారు. షైన్ టామ్ చాకోతో పాటు అతడి సోదరుడు, తండ్రి కలిసి కారులో త్రిస్సూర్ నుంచి బెంగళూరుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే వారు ప్రయాణిస్తున్న కారు తమిళనాడులోని ధర్మపురి జిల్లా పాలకొట్టై సమీపంలోకి రాగానే ఎదురుగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో చాకో తండ్రి సీపీ చాకో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా చాకోతో పాటు సోదరుడు, డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరిని చికిత్స నిమిత్తం ధర్మపురి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
రోడ్డు ప్రమాదంలో మలయాళ నటుడు షైన్ టామ్ చాకోకి తీవ్ర గాయాలు, తండ్రి దుర్మరణం
June 06, 2025
0
Tags