దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 5,364

Telugu Lo Computer
0


దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,364గా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. పలు రాష్ట్రాలలో 4,724 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని, ఇప్పటివరకు వైరస్‌తో దేశవ్యాప్తంగా 55 మంది మరణించినట్లు పేర్కొంది. గత 24 గంటల్లో 498 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో వైరస్‌తో నలుగురు మృతి చెందారు. మరణించిన వారిలో ఇద్దరు కేరళకు చెందిన వారు కాగా.. కర్ణాటక, పంజాబ్‌లలో ఒక్కొక్కరు ఉన్నారు. కేరళలో అత్యధికంగా 1,679 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. గుజరాత్ (615), పశ్చిమ బెంగాల్ (596), ఢిల్లీ (562) తరువాతి స్థానాల్లో ఉన్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)