ఇరాన్‌పై ఈరోజు తెల్లవారుజామున ఇజ్రాయెల్ దాడి చేసింది. టెహ్రాన్‌ను లక్ష్యంగా చేసుకుని బాంబులు వేసింది. ఈ దాడితో మొత్తం టెహ్రాన్ కుదుపుకు గురైంది. ఈ దాడిలో ఇజ్రాయెల్ ఇరాన్ అణు స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడి గురించి ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు మాట్లాడుతూ ఇజ్రాయెల్ ‘లక్ష్యంగా చేసుకున్న’ ఆపరేషన్‌ను ప్రారంభించిందని అన్నారు. ఇరాన్ అణు శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకున్నామని నెతన్యాహు అన్నారు. ఈ దాడిలో ఇరాన్‌కు భారీ నష్టం వాటిల్లిందని ఇజ్రాయెల్ పేర్కొంది. అణు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. అయితే ఇరాన్‌పై దాడి చేసిన తర్వాత.. ఇజ్రాయెల్ తన వైమానిక ప్రాంతాన్ని మూసివేసింది. టెహ్రాన్ వేగంగా అభివృద్ధి చెందుతున్న అణు కార్యక్రమంపై ఉద్రిక్తతలు కొత్త శిఖరాలకు చేరుకున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని వేగంగా పూర్తి చేయబోతోందని వస్తున్నాయి. ఈ వినిపిస్తున్న తరుణంలో ఇజ్రాయెల్ చేసిన ఈ దాడి చాలా పెద్దది. ఎందుకంటే ఈ దాడి లక్ష్యం కేవలం ఇరాన్ అణు స్థావరాలను ధ్వంసం చేయడమే అన్నట్లు తెలుస్తోంది. తెల్లవారుజామున టెహ్రాన్‌లో పేలుళ్ల శబ్దాలు వినడం ప్రారంభించాయి. నగరం మొత్తం పొగ కమ్మేసింది. అయితే, ఇజ్రాయెల్ దాడి చేస్తే.. ఇరాన్ కూడా తగిన సమాధానం ఇస్తుందని ఇరాన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి ?
June 13, 2025
0
Tags