సుదర్శన్ వేణును టీవీఎస్ మోటార్ కంపెనీ..కొత్త ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా సంస్థ నియమించింది. ఈ నియామకం 2025, ఆగస్టు 25 నుంచి వర్తిస్తుంది. బోర్డులో తన పదవీకాలంలో టీవీఎస్ మోటార్‌ను స్థిరమైన వృద్ధి, వ్యూహాత్మకంగా నడిపించడంలో వేణు కీలక పాత్రను గుర్తిస్తూ కంపెనీ బోర్డ్ అఫ్ డైరెక్టర్స్ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న వేణు, బోర్డు ప్రస్తుత ఛైర్మన్ 'సర్ రాల్ఫ్ స్పెత్' స్థానంలో నియమితులవుతారు. రాబోయే వార్షిక సాధారణ సమావేశం తర్వాత 'సర్ రాల్ఫ్ స్పెత్' ఛైర్మన్ పదవి నుంచి వైదొలుగుతారు. ఆ తర్వాత ఆయన మూడేళ్ల పాటు చీఫ్ మెంటార్‌గా ఉంటారు. డైరెక్టర్‌గా సుదర్శన్ వేణు చేసిన ఆదర్శప్రాయమైన కృషికి గుర్తింపుగా ఆయనను ఛైర్మన్‌గా నియమించినట్లు టీవీఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. కంపెనీ..ప్రపంచవ్యాప్తంగా మరింత అభివృద్ధి చెందడానికి మార్గదర్శకత్వం వహించడంలో దాని ప్రస్తుత ఛైర్మన్ 'సర్ రాల్ఫ్ స్పెత్' కీలక వ్యక్తి అని, స్పెత్ నుంచి నిరంతర మార్గదర్శకత్వం కోసం తాను ఎదురుచూస్తున్నానని కాబోయే ఛైర్మన్ 'సుదర్శన్ వేణు' అన్నారు.
టీవీఎస్ ఛైర్మన్‌గా సుదర్శన్ వేణు
June 05, 2025
0
Tags