తెలంగాణాలో ప్రజాసమస్యల పరిష్కారానికి మరో వినూత్న కార్యక్రమానికి టీపీసీసీ శ్రీకారం చుట్టింది. మంగళవారం నుంచి ప్రజా ప్రతినిధుల కార్యక్రమం అందుబాటులోకి రానుంది. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సూచన మేరకు ప్రతిరోజు ఇద్దరు ప్రజా ప్రతినిధులు అందుబాటులో ఉండేలా కార్యక్రమాలు చేపట్టనున్నారు. గాంధీ భవన్‌లో జూన్ 10వ తేదీ నుంచి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అందుబాటులో ఇద్దరు కార్పొరేషన్ చైర్మన్లు ఉండనున్నారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను ప్రభుత్వంతో పరిష్కరించేందుకు కార్పొరేషన్ చైర్మన్లు కృషి చేయనున్నారు. ఆ తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు కూడా వరుసగా జూన్ 10వ తేదీ నుంచి ప్రతి రోజూ ఇద్దరు చొప్పున గాంధీ భవన్‌లో అందుబాటులో ఉంటారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రేపటి నుంచి ప్రజా వినియోగ కార్యక్రమం ప్రారంభం కానుంది. రేపటి కార్యక్రమానికి వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా, మాజీ ఎంపీ కాసుల బాలరాజు హాజరుకానున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సూచనల మేరకు ఈ కార్యాచరణ చేపట్టారు. ఇప్పటికే మంత్రులతో 'ముఖాముఖి' కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
ప్రతి రోజు ఇద్దరు ప్రజా ప్రతినిధులు అందుబాటులో ఉండేలా టీపీసీసీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం
June 09, 2025
0
Tags