కాకాణి గోవర్థన్ రెడ్డిపై మరో కేసు నమోదు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిపై ఏపీ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. గత వైకాపా ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని జిల్లాలోని ముత్తుకూరు మండలం, కృష్ణపట్నం పోర్టుకు వెళ్ళే రహదారిపై అక్రమంగా టోల్ ప్లాజా ఏర్పాటు చేసి కంటైయినర్ల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూళ్లకు పాల్పడినట్టు పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయగా, ప్రస్తుతం నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆయనపై ఏపీ పోలీసులు మరో కేసును నమోదు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)