ఇండిగోకు చెందిన 6ఈ 2006 విమానం గురువారం ఉదయం ఢిల్లీ నుంచి లెహ్ కు బయలుదేరింది. మధ్యలో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించారు. ఢిల్లీలో అత్యవసరంగా సేఫ్ ల్యాండ్ చేశారు. ఆ సమయంలో విమానంలో ప్రయాణికులు, క్రూ సిబ్బంది మొత్తం 180 మంది ఉన్నారు. ఈ విషయాన్ని ఇండిగో కూడా ధృవీకరించింది. ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించింది.
సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్
June 19, 2025
0
Tags